ఈ నెల 29వ తేదీన నిర్వహించే దీక్ష దివస్ వేడుకలకు ప్రజలు తరలిరావాలని బిఆర్ఎస్ జిల్లా ఇంచార్జి దేవి ప్రసాద్ కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తు ఉద్యమాలపై దీక్షా దివస్ ద్వారా దిశా నిర్దేశం చేస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజం కలిగించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్ రావు పాల్గొన్నారు.