సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో డీఎస్సీ 2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి లింభాజీ సర్టిఫికెట్ల పరిశీలనను పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 33 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు డిఈవో తెలిపారు. ఈ నెల ఐదవ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు.