పత్తి పంటకు మద్దతు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సదాశివపేట మండలం మేలగిరిపేట గ్రామంలో పత్తి పంటలు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పత్తి పంట కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు యాదవ రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.