ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాహుల్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న డీఎలను వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.