ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి నిబందలు లేకుండా రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ విషయంలో కోర్టు ప్రమేయం లేకుండా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తేల్చాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిలకు ఆరు శాతం నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వేసిన కేసులో ముడి పడి ఉందని అందుకే కోర్టు తీర్పు వచ్చేవరకు గిరిజన రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు అన్నారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో గిరిజనులకు సంబంధించిన 10 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రేవేశ పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్, దినేష్ నాయక్, విజయ్ నాయక్, దిలీప్, గంగారాం లు పాల్గొన్నారు.