రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ. రైతులకు బేడీలు వేయడం ఏమిటని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిళ్ళ రాజేందర్ అన్నారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెంట్రల్ జైలులో ఉన్న ముగ్గురు లగచర్ల రైతులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వీరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.