సంగారెడ్డి పట్టణం లక్ష్మీ నగర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పండ్ల రసాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలను జరిపించారు. అమ్మవారికి మహా నైవేద్యం, మహా హారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.