ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన టేక్మాల్ లో ఆదివారం జరిగింది. ఇంటి మిద్దె కూలడంతో శంకరమ్మ అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకరమ్మ కుటుంబానికి 2. 11 లక్షల సహాయాన్ని ప్రకటించారు. అంత్యక్రియల కొరకు 11 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు.