మంగళవారం సంకష్టహర చతుర్థి కలిసిరావడంతో కృష్ణ అంగారక సంకష్టహర చతుర్థి పూజలను రేజింతల్ వరసిద్ది వినాయక ఆలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. న్యాల్‌కల్ మండలం రేంజింతల్ గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలవైయున్న తొలి మొక్కుల దేవుడికి కృష్ణ అంగారక సంకష్టహర చతుర్ధి సందర్భంగా వేకువజామున అభిషేకాలు, విశేష పూజలను జరిపారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆది పూజితుడిని దర్శించుకొని తరించారు.