సంగారెడ్డి జిల్లాకు కొత్తగా మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి గురువారం తెలిపారు. మండలంలోని నేరడి గుంట చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్, ఝరాసంఘం మండలం లోని బర్దిపూర్ గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సర్కారు కేటాయించిందని పేర్కొన్నారు. త్వరలో అధికారికంగా స్పష్టత వస్తుందని తెలిపారు.