సంగారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి దీపావళి శుభాకాంక్షలు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీపావళి పండుగ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కుల, మతాలకు అతీతంగా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.