జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని టీ. జి. ఎస్. డబ్ల్యూ. ఆర్. ఎస్ గురుకుల బాలికల పాఠశాలలో ప్రముఖ సేవకుమార్ చే మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పారిశ్రమిక వేత్త, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. వసతి గృహంలో ఉన్న పలు సమస్యలను తీర్చాలని ప్రముఖుల దృష్టికి ఉపాధ్యాయ బృందం తీసుకువచ్చారు. స్పందించిన ప్రసాద్ రెడ్డి తక్షణమే రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు.