జహీరాబాద్: సంక్రాంతి సందర్భంగా మహేంద్ర కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముగ్గుల పోటీలను బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శోభారాణి పాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అర్చన, శారద, అరుణ కౌలాస్ విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.