క్రికెట‌ర్‌ ష‌మీతో సానియా మీర్జా పెళ్లి.. ఇమ్రాన్ మీర్జా స్పందన ఇదే

61చూసినవారు
క్రికెట‌ర్‌ ష‌మీతో సానియా మీర్జా పెళ్లి.. ఇమ్రాన్ మీర్జా స్పందన ఇదే
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇటీవలే వివాహబంధానికి ముగింపు పలికిన సానియా మీర్జా మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ షమీని సానియా పెళ్లాడనున్నారని వాటి సారాంశం. వీటిపై టెన్నిస్ స్టార్ తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ‘ఇవన్నీ చెత్త వార్తలు. సానియా కనీసం అతడిని (షమీ) కలవనేలేదు’ అంటూ ఊహాగానాలను కొట్టిపారేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్