AP: నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరుడు.. అభిషేక్‌రెడ్డి ఆగడాలు తాళలేక మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నూకలపాటి ప్రసాద్‌రెడ్డి తాళ్లపాలెంలో 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోతకు వచ్చింది. వీరిని హుటా హుటిన కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలను సేకరించారు.