AP: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో డెప్యూటేషన్‌పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ హరికిరణ్ ఒక విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థుల సలహాతో బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. తన ఫోన్‌కు హరికిరణ్ పంపిన ఆడియో, వీడియోలను అందించారు. ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో హరికిరణ్‌ను సస్పెండ్ చేశారు.