ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో 10 నుంచి 12 రోజులు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. IMD ప్రకారం, మైదానాల్లో ఉష్ణోగ్రత 40°C లేదా అంతకంటే ఎక్కువకు చేరుకున్నప్పుడు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఈ 12 రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. అత్యవసరమైతేగాని బయటకు వెళ్లకూడదని తెలిపింది.