AP: రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గురువారం 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం 89 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.