ఏపీలో భానుడు రోజురోజుకూ మండిపోతున్నాడు . గురువారం 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.