హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా, పలువురు చిన్నారులకు గాయాలు

85చూసినవారు
హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా, పలువురు చిన్నారులకు గాయాలు
హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పంచకుల సమీపంలోని టికార్ తాల్ ప్రాంతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం చిన్నారులను హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్