చాలా మందికి బెడ్ పై పడుకుని స్క్రీన్ చూడటం అలవాటు. అయితే బెడ్ పై పడుకుని మొబైల్ లో గేమ్స్ ఆడటం, మల్టీ టాస్కింగ్ వంటి యాక్టివిటీలు నిద్రకు భంగం కలిగిస్తాయని ఇటీవల యువతపై జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. నిద్రించడానికి రెండు గంటల ముందు స్క్రీన్ చూసి ఆ తర్వాత నిద్రపోవడం వల్ల నిద్రపై తక్కువ ప్రభావం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. కొన్నిసార్లు పడుకునే ముందు స్క్రీన్ చూడటం అనేది నిద్రపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తెలిపింది.