తెలంగాణ సెక్రటేరియట్ భద్రత బాధ్యతలను నేటి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) చూసుకోనుంది. గతంలో సచివాలయ భద్రతను TGSP బెటాలియన్ కు చెందిన సిబ్బంది చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. బీఆర్ఎస్ సర్కారు TGSPకి అప్పగించగా, ప్రస్తుత
కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.