దసరా రోజు పాలపిట్టను చూస్తే విజయం తథ్యం: పురాణాలు

77చూసినవారు
దసరా రోజు పాలపిట్టను చూస్తే విజయం తథ్యం: పురాణాలు
దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారో చాలామందికి తెలిసి ఉండదు. త్రేతా యుగంలో రావణాసురుని మీద శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు పాలపిట్ట కనిపిస్తుంది. అది విజయదశమి రోజు కావడం విశేషం. ఆ తరువాత జరిగిన యుద్ధంలో రావణ సంహారం జరిగి, శ్రీరాముడు విజయాన్ని సాధిస్తారు. అలాగే, మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద దాచినప్పుడు, ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వాటిని కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల పాలపిట్టను విజయ సూచికగా భావించడం ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్