అశ్విన్‌పై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

77చూసినవారు
అశ్విన్‌పై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సీజన్‌లో అశ్విన్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఒకవేళ అతడి గణాంకాలు సరిగ్గా లేకపోతే కనీసం వచ్చే ఏడాది జరగబోయే వేలంలో తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి కూడా చూపరు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ఖాయం. అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్‌ వర్కౌట్ కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్