ఆ బైక్స్ అన్నీ సీజ్.. హైదరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక

63చూసినవారు
ఆ బైక్స్ అన్నీ సీజ్.. హైదరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక
హైదరాబాద్‌ సిటీలో ఇటీవల చైన్ స్నాచింగ్‌ కేసులు విపరీతంగా పెరిగాయి. రోడ్డు మీద ఒంటరిగా మహిళ కనబడితే చాలు.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఇటువంటి చాలా కేసుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. సదరు బైకులకు నెంబర్ ప్లేట్స్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్