టీ20వరల్డ్ కప్‌లో సంచలనాలు.. ఆ మ్యాచ్‌పై ఆసక్తి

69చూసినవారు
టీ20వరల్డ్ కప్‌లో సంచలనాలు.. ఆ మ్యాచ్‌పై ఆసక్తి
T20WCలో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా అడుగుపెట్టిన జట్లు బలమైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాయి. జూన్ 5న PNGపై ఉగాండా గెలవగా, జూన్ 6న పాకిస్థాన్‌ను USA ఓడించింది. నిన్న ఐర్లాండ్‌ను కెనడా ఓడించగా, తాజాగా న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ చిత్తు చేసింది. నేడు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మ్యాచ్ ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్‌ టోర్నీల్లో SAను NED రెండుసార్లు ఓడించింది. దీంతో నేటి మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్