రామోజీరావు నిర్మించిన సినిమాల్లో ‘శ్రీవారికి ప్రేమ లేఖ’ మొదటిది. ఆయన తెలుగు ప్రజలకు చాలా మంది హీరోలను పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్‌ను పరిచయం చేస్తూ ‘చిత్రం’ అనే సినిమాను నిర్మించారు. ‘నువ్వే కావాలి’ సినిమాతో తరుణ్‌ను పరిచయం చేశారు. జూనియర్
ఎన్టీఆర్ మొదట హీరోగా నటించిన ‘నిన్ను చూడాలని’ సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘నచ్చావులే’ సినిమా నిర్మించారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు.