ఏపీ ఎన్నికల్లో
టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ నెల 12న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఫలితాల తర్వాత ఏపీలో
టీడీపీ,
వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ
టీడీపీ నేతలు సంయమనం పాటించాలన్నారు. దాడులు, ప్రతిదాడులకు పాల్పడవద్దని అన్నారు.