జమ్మూకశ్మీర్ రాజౌరీలోని బధాల్‌లో వరుస మరణాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బధాల్‌లో ఇటీవల పలు కుటుంబాల్లో 17 మంది అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం మిస్టరీ మరణాల గురించి తెలసుకునేందకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉన్నతస్థాయి కేంద్ర బృందం సోమవారం గ్రామంలో పర్యటించింది.