మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో వేగంగా వస్తున్న డంపర్ ఆదివారం రాత్రి ఆటో రిక్షాపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డంపర్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.