తెలంగాణలో రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, కె.వి. నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.