రన్‌ వేపై విమానం అదుపు తప్పడంతో పలువురికి గాయాలు (వీడియో)

1036చూసినవారు
రన్‌ వేపై విమానం అదుపు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తాజాగా ఇండోనేసియాలో చోటుచేసుకుంది. పపువా రీజియన్‌ యాపిన్‌ ద్వీపంలో 48 మందితో టేకాఫ్‌ అవుతున్న ఏటీఆర్‌-42 విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలో చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఓ పాపతో సహా 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్