అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మాజీ మహిళా టీచర్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఓ టీనేజ్ విద్యార్థితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న మెలిసా కర్టిస్ అనే 32 ఏళ్ల టీచర్‌కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. 8వ గ్రేడ్ విద్యార్థికి మద్యంతో పాటు మారిజోనా మత్తుపదార్ధాన్ని ఇచ్చి.. పలుమార్లు అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. అక్టోబర్ 2023లో ఈ కేసు విచారణ మొదలు కాగా, తాజాగా శిక్ష ఖరారైంది.