AP: 2024 ఎన్నికల అనంతరం మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురాంమిరెడ్డి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. వైసీపీకి వెన్నుముక్కలా పనిచేసిన కేడర్ ని ఆయన పూర్తిగా విస్మరిస్తుండటంపై పార్టీ పరంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే నిరాశలో ఉన్న వైసీపీ కేడర్‌ని ఆయన పట్టించుకోవడం మానేశారంట. ఈ క్రమంలో రఘురాంమిరెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పనున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ కు భారీ షాక్ తగులుతుంది.