దేవర హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తెలుగు భాష మీద ఉన్న పట్టు చూసి షాకయ్యానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. 'దేవర' ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ గురించి జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'బాంబేలో పెరిగిన ఆమెకు ఇక్కడి భాష ఇంత బాగా ఎలా వస్తుంది? దక్షిణాదిలో తన మూలాలు ఉన్నప్పటికీ అంత స్పష్టంగా తెలుగు మాట్లాడటం కష్టమే కదా." అని అన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దేవర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది.