రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన గ్రామస్థుల్లో ఒక మూఢ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కనిపించే తితుడిగా పిలుచుకునే ఓ పక్షి ఉంటుంది. దీన్ని రెడ్-వాటిల్డ్ లాప్‌వింగగా పిలుస్తుంటారు. ఈ పక్షి ఎత్తైన ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంటుంది. అయితే అవి గుడ్లు పెడితే అక్కడ కొద్ది రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని స్థానికులు నమ్ముతారు. వీటికి వాతావరణ సంకేతాలు ముందుగానే తెలుస్తాయని, ప్రమాద వేళలో తోటి పక్షులను అలర్ట్ చేసేందుకు బిగ్గరగా అరుస్తాయని స్థానికులు చెబుతుంటారు.