ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి థార్ వాహనాన్ని చాలా రాష్‌గా డ్రైవ్ చేశాడు. నడిరోడ్డుపై వెళ్తూ పక్కన ఉన్నవారందరిని ఢీకొడుతూ వెళ్లాడు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో నెటిజన్లు ఆ వాహనం నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు.