(SHOCKING VIDEO) డాక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

71చూసినవారు
కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా ఆస్పత్రిలో డాక్టర్‌పై ఒక పేషెంట్‌ బంధువులు దాడికి దిగారు. ఆస్పత్రికి వచ్చిన ఇర్షాద్ అనే పేషెంట్‌ను అతడి బంధువులు తీసుకొచ్చారు. డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది రావడంతో బయటకు వెళ్లమన్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగి, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డాక్టర్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్