సిద్ శ్రీరామ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి యువత హృదయాలను గెలుచుకున్నారు. అయితే సిద్ పాడిన పుష్ప సినిమాలోని 'చూపే బంగారమాయేనే శ్రీవల్లి' సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటను ఓ కార్యక్రమంలో మరోసారి పాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.