రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ ఆహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బిర్యాని నుంచి షవర్మా వరకు కల్తీ అవుతోందన్నారు. ఈ క్రమంలోనే తమ సర్కార్ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఇన్స్పెక్షన్ల ను పెంచామని.. మంత్రి స్పష్టం చేశారు.