అక్బర్ పేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో కరీంనగర్' పాల డైరీ ఆధ్వర్యంలో యువతి వివాహనికి బుధవారం కానుకగా పుస్తె మట్టెలు అందజేశారు. గ్రామానికి చెందిన పాడి రైతు గోపరి శారద, యాదగరి దంపతుల కుతురు అఖిల వివాహం జరగడంతో కరీంనగర్ పాలడైరి నుండి పుస్తె మట్టెలను అందజేయడం జరిగిందని బుధవారం మేనేజర్ సాయికుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాజగౌడ్ తెలిపారు.