కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అక్బర్ పేట భూంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతూరి వెంకట స్వామి గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వేరు, భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలన్నారు.