సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన ఎండి ముస్తఫాకు చెందిన బైక్ ను గుర్తుతెలియని వ్యక్తి అర్ధరాత్రి నిప్పుపెట్టారు. ముస్తఫా రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. శనివారం 2: 27 గంటల సమయంలో బైక్ పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డు కాగా బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.