కరాటే విద్యార్థులను సన్మానించిన దుబ్బాక సీఐ

69చూసినవారు
కరాటే విద్యార్థులను సన్మానించిన దుబ్బాక సీఐ
నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జాతీయ స్థాయి మూడవ కరాటే, కుంగ్ ఫూ చాంపియన్ షిప్ పోటీల్లో దుబ్బాక మండలంలో గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండు బంగారు పథకాలు సాధించారు. ఈ మేరకు బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో విద్యార్థులను సీఐ శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్