దుబ్బాక: రాష్ట్ర స్థాయికి ఎంపికైన పెద్ద చికోడ్ విద్యార్థిని

83చూసినవారు
దుబ్బాక: రాష్ట్ర స్థాయికి ఎంపికైన పెద్ద చికోడ్ విద్యార్థిని
దుబ్బాక మండలం పెద్ద చికోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని కె భువన బుధవారం కొడకండ్ల నందు నిర్వహించిన జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ నందు మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ నెలలో హైదరాబాదులో జరిగేటటువంటి పోటీలలో పాల్గొననుంది.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినినీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి జానకి రాములు, ఉపాధ్యాయ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్