Feb 19, 2025, 02:02 IST/
భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు (వీడియో)
Feb 19, 2025, 02:02 IST
హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కర్నాల్ జిల్లా అలీపురా గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లు గోదాములో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.