TG: మంత్రి జూపల్లి గాంధీభవన్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ పేరు మరచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. తనను ముఖ్యమంత్రి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. "నా మాటలు గుర్తు పెట్టుకోండి జూపల్లి గారూ.. మీరు చేసిన ఈ తప్పుకు త్వరలోనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి రేవంత్ తొలగించడం ఖాయం" అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ వేదికగా జూపల్లి వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.