స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. 2024 ఏప్రిల్ లో ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వగా జులైలో టైర్-1, నవంబర్ లో టైర్-2 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్ సైట్ ను https://ssc.gov.in/ సందర్శించండి.