జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డిసెంబర్ 30 తేదీన గజ్వేల్ కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్జ్ డాక్టర్ టీ రఘురామ్ పేర్కొన్నారు. జిల్లా అదనపు జడ్జి మురళీమోహన్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జెడ్జ్ సౌమ్య, అదనపు జూనియర్ సివిల్ జెడ్జ్ ప్రియాంక లతో కలిసి న్యాయవాదులు, పోలీస్ సిబందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.