8న జాతీయ లోక్ అదాలత్

64చూసినవారు
8న జాతీయ లోక్ అదాలత్
గజ్వేల్ లో జూన్ 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సివిల్ జడ్జ్ బి. ప్రియాంక పేర్కొన్నారు. ఈ సందర్బంగా గురువారం వారు మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పిలుపు మేరకు జాతీయ లోక్ అదాలత్ లో రాజిపడి కేసుల పరిష్కారం కొరకు లోక్ అదాలత్ చక్కని వేదికని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీస్ సిబ్బంది నర్సింహా చారి, యామిని, కోర్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్